Thursday, September 24, 2015

కట్టు బానిసల కోసం సవరించిన చట్టం ముసాయిదా విడుదల


కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ, 22 సెప్టెంబర్ 2015 న  కేంద్రం అమలుచేస్తున్న పథకంలో భాగంగా కట్టుబానిస కార్మికుల పునరావాసం కోసం ఉద్దేశించిన ప్రణాళికను విడుదలచేసింది.
సవరించిన ఈ పథకం  గతంలోని ఒరిజినల్ పథకం-1978 లోపాలను సవరించి, పునరావాస ప్యాకేజీ, ప్రత్యేక కేటగిరీ ప్రయోజనాలు, పర్యవేక్షణ లోపాలను సవరించారు.
సవరించిన స్కీంలోని ముఖ్యాంశాలు
  •  ఈ పథకం కేంద్రప్రభుత్వం పరిధిలోనిది. గతంలో స్కీంని సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీం (సీఎస్ఎస్) అనేవారు. ఇప్పుడు సెంట్రల్ సెక్టార్ స్కీం (సీఎస్ఎస్) అంటున్నారు. సవరించిన ఈ  స్కీం అమలుకోసం అయ్యే మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.
  •  పునరావాస ప్యాకేజీలో భాగంగా పురుషుడైన లబ్ధిదారుడికి రూ.1 లక్ష రూపాయలు అందచేస్తారు.
  •  స్సెషల్ కేటగిరీ ప్రయోజనాల కింద యువకులు, అనాథలు, ఆడపిల్లలు, బలవంతంగా యాచక వృత్తిలోకి లాగబడినవారు, బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి వచ్చినవారికి ఒక్కొక్కరికీ రూ.2 లక్షలు అందచేస్తారు.
  •  వికలాంగులకు మాత్రం రూ.3 లక్షలు అందచేస్తారు.
  •  సున్నితమయిన జిల్లాల్లో కట్టుబానిసలుగా ఉన్న కార్మికుల సర్వే కోసం రూ.4 లక్షల 50 వేల రూపాయలు అందచేస్తారు.
  •  ఈ పథకం గురించి అవగాహన కల్పించేందుకు ఒక్కో రాష్ట్రానికి 10 లక్షల రూపాయలు కేటాయించారు.

No comments:

Post a Comment