Saturday, September 26, 2015

ఓడిశా అమ్మాయి కి గూగుల్ బహుమతి

22 సెప్టెంబర్ 2015న, ఒడిషాలోని కోరాపుట్ జిల్లాకు చెందిన 9వ తరగతి విద్యార్ధిని లలిత ప్రసీద శ్రీపాద శ్రీసాయి, కాలిఫోర్నియాలో జరిగిన ఐదవ గూగుల్ సైన్స్ ఫెయిర్ 2015లో ప్రతిష్టాత్మక కమ్యూనిటీ ఇంపాక్ట్ అవార్డు గెలుచుకుంది.

కోరాపుట్ లోని డీపీఎస్ ధమన్ జ్యోడి విద్యార్ధిని. మొక్కజొన్న కండెల పొరల మధ్య నుంచి వ్యర్ధనీటిని తొలగించే లక్ష్యంతో తక్కువ ఖర్చుతో అభివృద్ధి  చేసిన వాటర్ ఫ్యూరిపయర్ ని లలిత శ్రీ ప్రసీద ఆవిష్కరించింది.
ఈ అవార్డులో భాగంగా 13 ఏళ్ళ లలిత ప్రసీద శ్రీపాద శ్రీసాయి 10 వేల అమెరికన్ డాలర్లను బహుమతి మొత్తంగా అందచేస్తారు. అంతేకాదు గూగుల్ సంస్థ ఈ ప్రాజెక్టు అభివృద్ధికి ఏడాది పాటు సాయం అందచేస్తుంది.
ఐదవ గూగుల్ సైన్స్ ఫెయిర్ లో విజేతలు: 
•గ్రాండ్ ప్రైజ్: ఒలీవియా హాలీసే (16) అమెరికా
• కమ్యూనిటీ ఇంపాక్ట్ అవార్డు: లలిత ప్రసీద శ్రీపాద శ్రీసాయి (13) ఇండియా
• విర్జిన్ గాలాక్టిక్ పయనీర్ అవార్డు: ప్రణవ్ శివకుమార్ (15) అమెరికా
• లెగో ఎడ్యుకేషన్ బిల్డర్ అవార్డు అనురుధ్ గణేషన్ (15), అమెరికా
• గూగుల్ టెక్నాలజిస్ట్ అవార్డు - గిరీష్ కుమార్ (17), సింగపూర్
• ఇన్ క్యూబేటర్ అవార్డు - ఇలియట్ సర్రె (14), ఫ్రాన్స్
• సైంటిఫిక్ అమెరికన్ ఇన్నోవేటర్ అవార్డు- కిర్టిన్ నిత్యానందం (14), యునైటెడ్ కింగ్ డమ్
• నేషనల్ జియోగ్రఫిక్ ఎక్స్ ప్లోరర్ అవార్డు: దీపికా కురుప్ (17) అమెరికా
గూగుల్ సైన్స్ ఫెయిర్ గురించి
గూగుల్ సైన్స్ ఫెయిర్ ఆన్ లైన్ సైన్స్ కాంపిటీషన్. దీనిని గూగుల్, నేషనల్ జియోగ్రఫిక్, గలాక్టిక్, లిగో, వర్జిన్ మరియు సైంటిఫిక్ అమెరికన్ లు స్పాన్సర్ చేస్తున్నాయి.ఈ పోటీ ద్వారా 13 నుంచి 18 సంవత్సరాల వయసున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్ధులకు పోటీ నిర్వహిస్తారు. మొట్టమొదటిసారిగా గూగుల్ సైన్స్ ఫెయిర్ అవార్డును జూలై 2011 న ప్రకటించారు.

No comments:

Post a Comment